బిగ్ బాస్ హౌస్‌లోకి చరణ్ రీ ఎంట్రీ.. Insider నుంచి కీలక సమాచారం!

EPISODE 100

16 September 2026

బిగ్ బాస్ హౌస్‌లోకి చరణ్ రీ ఎంట్రీ.. Insider నుంచి కీలక సమాచారం!

బిగ్ బాస్ తెలుగు 10 లో తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రల్లో ఒకరు మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఒకరికి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నిర్వహించిన ఓటింగ్ కూడా సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది.

బిగ్ బాస్ హౌస్‌లోకి చరణ్ రీ ఎంట్రీ.. Insider నుంచి కీలక సమాచారం!

అయితే ఇప్పుడు చరణ్ రీ ఎంట్రీపై ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది.

చరణ్‌కే రీ ఎంట్రీ ఛాన్స్?

నాకు అందిన Insider సమాచారం ప్రకారం చరణ్ మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే చరణ్, చైత్రల్లో చరణ్‌కే రీ ఎంట్రీ దక్కినట్లు సమాచారం.

అయితే ఇది ప్రస్తుతం Insider నుంచి అందిన సమాచారం మాత్రమే. బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొదటి వారంలోనే ఎలిమినేట్ కావడంతో చరణ్ తన గేమ్‌ను పూర్తిగా చూపించలేకపోయాడనే అభిప్రాయం కూడా కొంతమంది ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడు మరో అవకాశం వస్తే.. ఈసారి చరణ్ తన గేమ్‌ను ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

ముగిసిన రీ ఎంట్రీ ఓటింగ్

చరణ్, చైత్రల్లో ఒకరిని తిరిగి హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహించిన రీ ఎంట్రీ ఓటింగ్ ఇప్పటికే ముగిసింది. వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో తమకు ఓటు వేయాలని ప్రేక్షకులను కోరారు.

ఇక ఓటింగ్ పూర్తవడంతో ఫలితం ఎవరికి అనుకూలంగా వచ్చిందనే దానిపై బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

చరణ్ వస్తే గేమ్‌లో మార్పులు ఉంటాయా?

ఇప్పటికే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య స్నేహాలు, గ్రూపులు, విభేదాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో చరణ్ తిరిగి హౌస్‌లోకి వస్తే.. అతని రీ ఎంట్రీ గేమ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి.

ముఖ్యంగా మొదటి వారంలోనే బయటకు వెళ్లిన చరణ్‌కు ఇప్పుడు రెండో అవకాశం వస్తే, గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని తన గేమ్‌ను మార్చుకుంటాడా? లేక మొదటిలాగే కొనసాగిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం అయితే చరణ్ రీ ఎంట్రీకి సంబంధించిన సమాచారం Insider లెవల్‌లోనే ఉంది. అధికారికంగా బిగ్ బాస్ ప్రకటించే వరకు ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అని చెప్పలేం.

కానీ నాకు అందిన సమాచారం ప్రకారం మాత్రం చరణ్ తిరిగి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే అవకాశమే కనిపిస్తోంది.

అసలు చరణ్ రీ ఎంట్రీ నిజమవుతుందా? హౌస్‌లోకి తిరిగి వస్తే అతని గేమ్ ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి.